Pvr Murty గారి చిత్రం...
నే చవిచూడని ఎన్నో భావాలని
తానై పరిచయం చేస్తోంది
నేనెదుర్కోని ఎన్నో సవాళ్ళని
విసిరేస్తోంది నా పైకి
జీవితమనే రణరంగం....
పచ్చదనంగా మనసుకు హత్తుకునే
మధురమైన స్నేహ పరిమళాలు...
నవ్వుతూనే కత్తులు దూసే కల్మషమైన
మనస్తత్వాల కఠినమైన చర్యలు..
సంతోషాలు విషాదాల సంగమంలో
సతమతమవుతూ గమ్యం తెలియని
ప్రయాణం ఆపేసి శాశ్వత నిద్రలోకి
జారుకుని సేదతీరాలనుకున్న సందర్భాలెన్నో
కానీ వెంటనే స్పురిస్తుందో ఆలోచన...
పోరాడి గెలవని గెలుపు ఒక విజయమేనా
సాఫీగా సాగితే అది సాహసమా
పువ్వులను ఏరుకుంటూ ముళ్ళను
వదిలించుకుంటూ వీలైతే దారిని
బాగు చేస్తూ సాగడంలోని ఆనందం
దాహంతో తడారిన గొంతులో
తీయని నీటి గుటకంత హాయి...
అందుకే నేను ఆశల ఆయుధం చేతపట్టి
ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నా
నా వెనక వచ్చే ఇంకెందరో బాటసారులకు
విజయపు సంకేతాలిస్తూ....!!
అనుశ్రీ....
81
నే చవిచూడని ఎన్నో భావాలని
తానై పరిచయం చేస్తోంది
నేనెదుర్కోని ఎన్నో సవాళ్ళని
విసిరేస్తోంది నా పైకి
జీవితమనే రణరంగం....
పచ్చదనంగా మనసుకు హత్తుకునే
మధురమైన స్నేహ పరిమళాలు...
నవ్వుతూనే కత్తులు దూసే కల్మషమైన
మనస్తత్వాల కఠినమైన చర్యలు..
సంతోషాలు విషాదాల సంగమంలో
సతమతమవుతూ గమ్యం తెలియని
ప్రయాణం ఆపేసి శాశ్వత నిద్రలోకి
జారుకుని సేదతీరాలనుకున్న సందర్భాలెన్నో
కానీ వెంటనే స్పురిస్తుందో ఆలోచన...
పోరాడి గెలవని గెలుపు ఒక విజయమేనా
సాఫీగా సాగితే అది సాహసమా
పువ్వులను ఏరుకుంటూ ముళ్ళను
వదిలించుకుంటూ వీలైతే దారిని
బాగు చేస్తూ సాగడంలోని ఆనందం
దాహంతో తడారిన గొంతులో
తీయని నీటి గుటకంత హాయి...
అందుకే నేను ఆశల ఆయుధం చేతపట్టి
ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నా
నా వెనక వచ్చే ఇంకెందరో బాటసారులకు
విజయపు సంకేతాలిస్తూ....!!
అనుశ్రీ....
81

No comments:
Post a Comment