Saturday, 15 July 2017

నేను



!!నేను!!!

అలిగిన  ఆనందాన్ని
అలసిన ఆవేశాన్ని....!!!

రక్తసిక్తమైన  మనసును
అందమైన శరీరంలో
దాచిన  అంతరంగాన్ని....!!

ఎవరికీ  అంతు తెలియని
ఎత్తైన శిఖరాన్ని....!!

వంచించిన  కాలంతో
నటిస్తున్న  జీవితాన్ని...!!!

రాతి దెబ్బలకి ముక్కలైన
స్వచ్చమైన గాజు  పుష్పాన్ని....!!

నిరంతర  యుద్దంలో
ఆగిపోయిన  ఆగ్రహాన్ని...!!

గాయాలకు  నెలవునై
శిధిలమవుతున్న విగ్రహాన్ని..!!

ఆలోచనల ఆంతర్యంలో
నిలకడైన నిగ్రహాన్ని...!!!

అయినా సరే
అందరికీ  తెలిసిన
అంతులేని  అహాన్ని....!!!!

              --అను--

No comments:

Post a Comment