Saturday, 15 July 2017

సహనం

!

సహనం  నశించే సమయం
ఎలా ఉంటుందో
బహుశా అనుభవిస్తే తప్ప
అర్థం కాదేమో..!!

మనుషులు చెప్పే సమాధానాలను
మనసుతో చెప్పి ఒప్పించలేక
కలవర పడే ఆలోచనలను
ఆధీనంలోకి తెచ్చుకోలేక
భావోద్వేగాలను బంధీ చేయలేక
చెంత నిలిచి ఊరడించి
ధైర్యమవ్వాల్సిన బంధాలన్నీ
దూరమై భయపెడుతుంటే...!!

అణుచుకున్న  ఆక్రందనంతా అరణ్యరోదనవుతుంటే
గుండెలో గూడు కట్టుకున్న వేదనంతా
ఒక్కసారిగా గొంతు చీల్చుకుని
దుఃఖంగా మారి తెరలు తెరలుగా
కన్నీరై ఉబికి వస్తుంటే....!!

ఉప్పొంగే  మది నదికి
ఆనకట్టలు  కట్టలేక
అంతరంగం నశించిపోతుంటే ...
అణువణువున ఆత్మ
 తల్లడిల్లి పోతుంటే...!!
కనిపించే నైరాశ్యమంతా
కటిక చీకటై తనువుని తలపుని
మింగేస్తుంటే కలిగే బాధ
పొందే నరకం.......
అనుభవిస్తే తప్ప అర్థం కాదు....!!

          అను.......
       
           107

No comments:

Post a Comment