Saturday, 15 July 2017

దూరం



నీకు నాకు మధ్యన దూరం
కొన్ని వేల మైళ్ళ దూరం
అయినా సరే ఆలోచనల ప్రదక్షిణల్లో
నీరంతరం నీ వెంటే నా గమనం...

కష్టాల కడలిలో నేను మునగకుండా సంతోషాల  తీరం  చేర్చే ఆధారం
నువ్వే అవుతావని ఆశల వంతెనలని
 ఊహల్లో చాలా బలంగా కట్టేసాను...

కానీ అందని ఆకాశంలో
అంతులేని చుక్కలలో ఎక్కడొ నువ్వు
చూపులు నింగికే అంకితమిచ్చి
వెతికే కన్నులలొన ఒలికే  కన్నీటితో
మిగిలే ఉన్న  నేను..!!

       అనుశ్రీ...

No comments:

Post a Comment