Friday, 14 July 2017

! కాలం !!

!

కాల్చేసిన కాలంతో
జత కట్టలేక
శూన్యానికై నేను
ఎగిరిపోతుంటే
ఆశూన్యమే నన్నావహించి
అంతం చేసేస్తోంది...!!

అంథకారమైన దారిలో
పయనం సాగదని
వెనుదిరిగి వస్తుంటే
మనసు నిండిన చీకటి
బ్రతుకునూ మింగేస్తోంది....!!

క్షణాల్లో జీవితం
నిముషాలలో మరణం
గతించే గడియలకి
నియమ నిబంధనలేవీలేవు..
కనికరమనే మాటే లేదు...
కబలిస్తూ వెళ్ళడం తప్ప...!!

      అను----
       29

No comments:

Post a Comment