Saturday, 15 July 2017

!!! పూలతీగ !!



ఏ ఆధారమూ లేని  ఓ  పూలతీగ
నేలమీద బలహీనమై వాలిపోతూ
చేయూతకై ఎదురు చూస్తూ ఉంటుంది..
ఏకోమ్మో  కర్రో చివరికి ముళ్ళకంచో
ఏదైనా సరే ఆధారంగా అల్లుకుపోతుంది
అంతకు మించి మార్గమే లేదని.....!!

సుగంధ సౌరభాలు ఆస్వాదిస్తూ
పూసిన పూలను కోసుకుంటూ
హాయిగా అనుభవించేందుకై వచ్చిన
చేతులకు ఎన్నటికీ అర్థం కాదు
అణువణువూ గాయమై రోధిస్తూ
విలపించే ఆ పూల మనసు...!!

పరిమళ గంధాలే ప్రతిమనసూ కోరేది
లోలోన ప్రతిక్షణం నలిగే  బాధెవరికి కావాలి
ప్రాణం నిలుపుకునేందుకు పడ్ద
ప్రయాసలెవరు చూడాలి
ఎవరూ రారు ఏదీ చేయరు
ఉన్నదే మనది ఉత్తమమైనది...!!

ఎందుకంటే జీవం నిలుపుకుంది
ఆ సూది మొనలపైనే
కాలాన్ని నెట్టుకొస్తున్నది కష్టాలతోనే
ఆసరా ఇవ్వని అందమైన పొదలకన్నా
నొప్పించినా తోడొచ్చిన ఆస్నేహమే
ఆధారమైనపుడు భరించడమూ ఆనందమే..!!

         అనుశ్రీ...
   
          108

No comments:

Post a Comment