!
ప్రతీ అనుభవాన్నీ పరిశీలిస్తోంది...
మనసు మంతనాలని
మనుషుల మరో రూపాలని.....
అణువంతైనా వదలకుండా
అప్రమత్తమైన నా మనోనేత్రం......!
పబ్బం గడుపుకోగానే
పరుగందుకుని పారిపోయి..
పొలిమేరలలో కూడా నిలవని
చపలమైన స్వభావాల
చిత్రమైన నాటకాలను
చిత్తరువై చూస్తోంది.........!!
మాటకు లోంగక
మంచిని తలవక
మమతల విలువెరుగక
మసకబారిన కరుకు
హృదయాల సడివిని
రెప్పవేయడమే మరిచిపోతోంది....!
అంతరంగమొక చీకటై మిగిలినా
చిరుమందహాసమై....
తిమిరాలని నింపుకుంటూనే
సమయం కోసం సంయమనంగా
ఎదురుచూస్తోంది.......
వీక్షించిన ప్రతీ క్షణాన్ని
కొత్త పాఠంగా
మదికి అచ్చువేస్తోంది.....!!
అను------
38
ప్రతీ అనుభవాన్నీ పరిశీలిస్తోంది...
మనసు మంతనాలని
మనుషుల మరో రూపాలని.....
అణువంతైనా వదలకుండా
అప్రమత్తమైన నా మనోనేత్రం......!
పబ్బం గడుపుకోగానే
పరుగందుకుని పారిపోయి..
పొలిమేరలలో కూడా నిలవని
చపలమైన స్వభావాల
చిత్రమైన నాటకాలను
చిత్తరువై చూస్తోంది.........!!
మాటకు లోంగక
మంచిని తలవక
మమతల విలువెరుగక
మసకబారిన కరుకు
హృదయాల సడివిని
రెప్పవేయడమే మరిచిపోతోంది....!
అంతరంగమొక చీకటై మిగిలినా
చిరుమందహాసమై....
తిమిరాలని నింపుకుంటూనే
సమయం కోసం సంయమనంగా
ఎదురుచూస్తోంది.......
వీక్షించిన ప్రతీ క్షణాన్ని
కొత్త పాఠంగా
మదికి అచ్చువేస్తోంది.....!!
అను------
38

No comments:
Post a Comment