శుభోదయం ఈమాట అనడం
జీవితంలో ఒక భాగమైపోయింది
ఒకప్పుడు ఒక్కరిద్దరు ఇప్పుడు
ఎందరో ఎందరెందరో.....!!
అయినా సరే ఎన్ని సార్లు విన్నా
ఎంత మంది చెప్పినా సరే
ఆత్మీయతని పంచే మనసు
పలకరించిన వేళ కలిగె ఆనందం
ఆస్వాదించే మదికే తెలుస్తుంది....
ఏ పలకరింతలూ లేని నాడు
ఏ పిలుపులూ నను తలవని రోజు....
ఎడారిలో వానచినుకులా
వేసవిలో మరుమల్లిలా......
సుప్రభాతాల వేళ సున్నితంగా
ఆలోచనల అగాధాల్లోంచి
తట్టిలేపి హాయి సమీరాలతో
ఉత్సాహపు ప్రోత్సాహపు అనునయాల
నను మేలుకొలిపిన ఓ పిలుపు
ఓదార్పులా ఓ మార్పులా
ఇన్ని స్నేహాలకు బంధాలకు
నాంది పలికిన ఆ చెలిమిని తలుస్తూ
ప్రతిరోజు నేనెదురు చూస్తుంటాను
ఉషోదయాన తొలి పలకులకై..!!
నీ పిలుపు నాకు చేరినపుడే అనిపిస్తుంది
వెలుగులు ప్రసరిస్తున్నాయని
మరో రోజు శుభంగా ప్రారంభమైందని
నవ్వుతూ నా దినచర్య సాగాలని...!!
అనుశ్రీ.....
జీవితంలో ఒక భాగమైపోయింది
ఒకప్పుడు ఒక్కరిద్దరు ఇప్పుడు
ఎందరో ఎందరెందరో.....!!
అయినా సరే ఎన్ని సార్లు విన్నా
ఎంత మంది చెప్పినా సరే
ఆత్మీయతని పంచే మనసు
పలకరించిన వేళ కలిగె ఆనందం
ఆస్వాదించే మదికే తెలుస్తుంది....
ఏ పలకరింతలూ లేని నాడు
ఏ పిలుపులూ నను తలవని రోజు....
ఎడారిలో వానచినుకులా
వేసవిలో మరుమల్లిలా......
సుప్రభాతాల వేళ సున్నితంగా
ఆలోచనల అగాధాల్లోంచి
తట్టిలేపి హాయి సమీరాలతో
ఉత్సాహపు ప్రోత్సాహపు అనునయాల
నను మేలుకొలిపిన ఓ పిలుపు
ఓదార్పులా ఓ మార్పులా
ఇన్ని స్నేహాలకు బంధాలకు
నాంది పలికిన ఆ చెలిమిని తలుస్తూ
ప్రతిరోజు నేనెదురు చూస్తుంటాను
ఉషోదయాన తొలి పలకులకై..!!
నీ పిలుపు నాకు చేరినపుడే అనిపిస్తుంది
వెలుగులు ప్రసరిస్తున్నాయని
మరో రోజు శుభంగా ప్రారంభమైందని
నవ్వుతూ నా దినచర్య సాగాలని...!!
అనుశ్రీ.....

ప్రభాతవేళ శుభాలు పలకడం హృదయ సత్సంప్రదాయానికి చిహ్నం...శుభోదయం చెల్లెమ్మా..
ReplyDelete