Friday, 14 July 2017

వెలితి..

-

ఈమాట  లేని  జీవితం
బహుశా  ఇలలో  లేదేమో
మనసులో  బ్రతుకులో
నిండుగా  మెండుగా
ఎన్ని  ఉన్నా  ఎదో  లేదనే  వెలితి
ఉండి  తీరాల్సిందే....??

పరిగెత్తే కాళ్ళకు గమ్యం చేరలేదని
కలలు కనే కళ్ళకు నిజం కాలేదని
పలకరించే మాటకు బదులు దొరకలేదని
అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనే వెలితి...!!
.
ఆ వెలితిని  పూరించుకునే దిశలో
అడుగులు వేస్తూ  అలసిపోతూ
ఆటుపోటులని  భరిస్తూ
ఎప్పుడో సాయం సంధ్యవేళ మేలుకుని
కళ్ళుతెరిస్తే మళ్ళీ పలకరించేది
వృధా అయిన కాలమనే మరో   వెలితి...!!
.
నడిచే  దారి మనదే...
కోరే తీరు తీరం  మనదే...
మంచీ  చెడూ అన్నీ మనవే
అంతా తెలిసి  అంగీకరించని  మనసూ మనదే....!!
అయినా సరే ఒప్పుకోనంటే
జీవితమే ఒక వెలితి....!

కల్పనలకు కార్యరూపాన్ని ఇచ్చి
ప్రతి తలపుని  తర్కంతో శోధించి
మనోఫలకంపై  మధురమైన జ్ఞాపకాల
శిల్పాలను చూడగలిగితే......
వెలితిలో  సైతం  వెలుగు  దారవుతుంది....!!!

          అను------
         41

No comments:

Post a Comment