Wednesday, 12 July 2017

!! మనోహరం !!



రాధా మనోహరాలు.......
మధుర సుగంధ పరిమళాలు
చిన్ననాటి గురుతుల ఆనవాలు
మనసు నింపుకున్న జ్ఞాపకాలు
మౌనంగా భాషించే సౌరభాలు
మదిని ఆక్రమించిన అందచందాలు.....!!

అరుగు మీది మా నవ్వులకు సాక్ష్యాలు
పందిరంతా పరుచుకుని
ప్రేమగా పలకరించిన పూల స్నేహాలు....!!

కాడలతో మాలలు అల్లి
మురిసిన మా బాల్యాలు......!!
ఇప్పటికీ ఎప్పటికీ మరువలేని
మా అమ్మమ్మ వాకిటి వసంతాలు.....!!

          ----అను------

No comments:

Post a Comment