Wednesday, 12 July 2017

కవిత్వం

~~శుభాకాంక్షలు~~

కలానికి గళాన్ని ఇచ్చి...
పదాలలో భావాలను ఒలికిస్తూ
మౌనంగా సంభాషిస్తూ
రచనలతో బలం ఇస్తూ
సమాజంలోని ప్రతీ కోణాన్నీ
సహజంగా సమ్మోహనంగా
మనసుని తాకేలా ఆవిష్కరిస్తూ
భవితపై భరోసానిస్తూ....
అక్షరాల హలంతో
ఆలోచనల శ్రమిస్తూ....
పరిష్కాలను పండించేదుకై
మస్తిష్కాన్ని  మదిస్తున్న
కవులందరికీ..పేరు పేరునా..
కవితా దినోత్సవ శుభాకాంక్షలు.....!!

          అనుశ్రీ....
             59

No comments:

Post a Comment