Wednesday, 12 July 2017

మహిళ





నిర్లిప్తభావాల కడలిని నేను
నిక్షిప్త అనుభవాల సారం నేను
సాగరమై ఘోషించే అనంత రాగం నేను
సప్తనదుల సంగమ తరంగం  నేను....!!

అమ్మనై జోలపాడే వేళ
అవనికి సమమైన సహనం నేను...
ఆలినై  సేద తీర్చే వేళ
అనురాగ బంధం నేను.....
కూతురై ప్రేమ పంచే వేళ
అమ్మకు మరో  అమ్మను నేను......!!

సోదరినై సొదలు వింటూ
కరిగే మంచు బిందువు నేను.....
స్నేహమై చేయి కలిపానంటే
జన్మంతా తోడొచ్చే నీడను నేను...
భక్తిలో యుక్తిలో వాడిపోని శుభాల
 తులసి మొలకను నేను..!!

భావాల జలధిలో
బంధాల కొలిమిలో
బాధ్యతల రణరంగంలో
కన్నీట మునుగుతూ కష్టాల తేలుతూ
చిరునవ్వుల పూయిస్తూ
చితివరకూ భరిస్తూ.........

సాగుతున్న ఆగని  అతివను నేను.....!!

        అనుశ్రీ...

No comments:

Post a Comment