Wednesday, 12 July 2017

!! నీ తోడు !!

!!

కారు చీకటి కమ్మేస్తున్నా
కడలి అలలే కట్టేస్తున్నా
సాగిపోదా జీవన గమనం
దారి చూపదా ఏదో ఒక నిముషం...
కలిసిరాదా కదిలించే కాలం
నడిచిరాదా వేకువ రాగం.....!!

ముసిరే మబ్బుని తొలగించే
గెలుపు దీపం నీవైతే...
ఆశల నావను నడిపించే
ఆత్మీయ బంధం నీవైతే..!!!

వెన్నెల వెలేసి వెలుతున్నా
వేదన మనసున పూస్తున్నా
నీ కన్నుల కాంతులు తోడైతే
నే కోరే చెలిమివి నీవైతే
చూడని కలలే నిజమవవా
అందని స్వర్గం దిగిరాదా.....!!!

           అను----
          31

No comments:

Post a Comment