ఆనందం సంపద వెంట ఉంటే...
చుట్టూ కదలనివ్వరు బలగం
అందలం ఎక్కించేస్తూ
నువ్వు లేక నేను లేననే
మాటలతో మంత్రం చేస్తూ
వీలైతే మునగచెట్టు
చివరి కొమ్మపై నిలబెడుతూ
పొగడ్తలతొ ముంచేస్తారు...
అవసరాలకోసం కళ్ళకి గంతలు
కట్టేస్తూ ఉంటారు...
వీళ్ళనా దూరంగా ఉంచాను
అని అనిపిస్తారు....!!
కాలం కలిసిరాక
కష్టాలు ఆవహించి
కల్లోలమైన మనసులో
కన్నీటి మేఘాలు కమ్ముకుని
నిలువునా ముంచేస్తుంటే..
ఆదరించే చేతులకోసం
చేయూత నిచ్చే స్నేహం కోసం తపిస్తుంటే
అమావాస్యని సైతం పౌర్ణమి చేసిన
కొన్ని మినుగురులకై వెతుకుతుంటే
ఏ వెలుగూ కానరాదు
ఏ తోడూ నీడ నివ్వదు
ఏ మాటా అభయమివ్వదు...!!
బలాన్ని కూడగట్టుకుని
నిలబడి నువ్వే వెలుగైతే
మళ్ళీ నీ చెంతకే కనుమరుగైన
పండగలు సందడులన్నీ...!!
బంధాలకు విలువివ్వాలి
బానిసగా మారకూడదు
తోడెవరో తోడేలెవరో
తెలుసుకోవాలి..
తెలిసిన తక్షణమే తేరుకోవాలి...!!
అను----45
17--2--17

No comments:
Post a Comment