వెన్నెల రాత్రి కబుర్లు
చల్లని స్నేహపు అల్లరులు
తీయని బంధమై గడిచిన రోజులు
నిర్మలంగా నిబ్బరంగా కొనసాగిన
ఆత్మీయ ఆనంద క్షణాలు..
మరువలేని మధుర జ్ఞాపకాలు....!!
కొత్త భావాల చేరికలు
తెలియని ప్రపంచపు రూపురేఖలు
వింటుంటే కలిగిన ఆశ్చర్యాలు
అనుభవాలై నేడు పలకరిస్తుంటే
అప్పటి మాటల మంత్రాలే
ఇప్పుడు చెవుల్లో ధ్వనిస్తున్నాయి.....!!
అమ్మ ఒడిలో పాపలుగా
జీవితానుభవాలని రంగరించిన
పాఠాలుగా విన్న నాటి కథలే
బ్రతుకు బాటలో సూచికలై
అలసిన వేళ ఆలంబనై
కొనసాగమంటూ భరోసానిస్తున్నాయి...!!
మననం చేసుకున్న ప్రతిసారి
గమనాన్ని నిర్దేశించే
చిన్ననాటి ప్రబంధాలు
అనుభవజ్ఞుల ఆశీర్వాదాలు.....!!
అను-----
57

No comments:
Post a Comment