గుసగుసలు
ఎవరో ఒకరిపై
ఉబుసుపోక ఊసులయ్యే రుసరుసలు...
ఆసక్తిగా వినేవాళ్ళ చెవులకు
పసందైన పదనిసలు.........!!
యదార్థాలకు అపార్థాలు జోడించి
స్థాయిని తేటతెల్లం చేస్తున్నామంటూ
నలుపు రంగుని గుప్పించే
నిందల నిర్వాకాలు.....
స్వభావాన్ని బయట పెట్టుకునే
ప్రలోభాలు....!!
నివురు గప్పిన నిప్పులా
కక్ష నింపుకున్న కత్తుల్లా
బాధల బహుమతుల్ని పంచి
బంధాలను తెంచే
అల్పమనస్తత్వాల విసుర్లు
విషపు సంస్కారానికి ఆనవాళ్ళు...
చాటున మాటేసి వినే చెవులు
చపల చిత్తాల కబుర్లు
సడిలేక వ్యాపించే
సాధింపుల అస్ర్రాలు.....!!
--అను--
53

No comments:
Post a Comment