ఎన్నో పరిచయాలు
ఎన్నో పలకరింపులు
ఎన్నో స్నేహాలు
మరెన్నో బంధుత్వాలు....!!
తొలకరి జల్లులై
కురిసే చినుకులై
మనసుని అను నిత్యం
తడుముతూ ఉంటాయి
కానీ అందులో చేరువై
మది తలపుల్లో నిండిపోయే
ఆత్మీయులు కొందరే
బాధలో వేదనలో
సంతోషంలో సమస్యల్లో
నీడై తోడై నడిపించే ఆ ఒక్కరూ
వందల వానచినుకుల్లో
మంచి ముత్యం లా......
జీవితాన ఒదిగిపోయి
జన్మంతా కలిసి ఉంటారు.....!!
అనుశ్రీ....
76

No comments:
Post a Comment