Friday, 14 July 2017

!!! వెన్నెల !!!



కాసింత వెన్నెలని అరువు తెచ్చుకోవాలి
మనసుని స్వచ్చంగా మార్చుకునేలా.....!!

గగనం అంచున ఒంటిగా ఉన్నా
తారల తళుకుల స్నేహంలో
సంబరం పంచుతూ...
మది దోచుకుంటున్న
తన చల్లదనాన్ని
మనసారా ఆస్వాదించాలి......!!

చీకటిలో ఉన్నా నలుపంటని
తెల్లని వెన్నెలై  సొగసులు పంచే
తన వెలుగులని
దిగులంతా తీరేలా...
గుండెలో  నింపుకుని
హాయిగా నిదురని ఆహ్వానించాలి....!!

----------అను------------46

No comments:

Post a Comment