🐒🐒!🐒
వనం విడిచిన కోతులం
నరుల మధ్య వానరులం
ఎంతైనా మీ పూర్వీకులం
కుదురు లేని కార్మికులం
చిరుతిళ్ళకు ఏలికలం
చిరాకులో మేమే మీ వారసులం...!!
శక్తి యుక్తులున్న నాడు
వారదితో నది దాటించాం
చేతకాక నడుస్తూ
మీ వాహనాల పడి మరణిస్తున్నాం
గాలిలో గంతులేస్తూ
గోల చేసిన వీరులం
గారడోళ్ళ చేతచిక్కిన
సంకెళ్ళకు నేస్తాలం...
రెమ్మకొ కాయనీ కొమ్మకొ పండుని
తిననేర్చిన నేర్పరులం...
విద్యుత్ ఘాతాల వాతపడి
నేలకొరుగుతున్న నాటి దూతలం
అడవి తల్లి అంతరిస్తే
వలస వచ్చిన అల్పులం
చెప్పుకోను దిక్కులేక మీ వైపుకి వస్తున్నాం
కన్నీళ్ళ మా గోడుని కరుణతో వినండి
చేష్టలతో విసిగిస్తే క్షమించండి
మూగ జీవుల విన్నపం విని కనికరించండి..!!
అను-------59
వనం విడిచిన కోతులం
నరుల మధ్య వానరులం
ఎంతైనా మీ పూర్వీకులం
కుదురు లేని కార్మికులం
చిరుతిళ్ళకు ఏలికలం
చిరాకులో మేమే మీ వారసులం...!!
శక్తి యుక్తులున్న నాడు
వారదితో నది దాటించాం
చేతకాక నడుస్తూ
మీ వాహనాల పడి మరణిస్తున్నాం
గాలిలో గంతులేస్తూ
గోల చేసిన వీరులం
గారడోళ్ళ చేతచిక్కిన
సంకెళ్ళకు నేస్తాలం...
రెమ్మకొ కాయనీ కొమ్మకొ పండుని
తిననేర్చిన నేర్పరులం...
విద్యుత్ ఘాతాల వాతపడి
నేలకొరుగుతున్న నాటి దూతలం
అడవి తల్లి అంతరిస్తే
వలస వచ్చిన అల్పులం
చెప్పుకోను దిక్కులేక మీ వైపుకి వస్తున్నాం
కన్నీళ్ళ మా గోడుని కరుణతో వినండి
చేష్టలతో విసిగిస్తే క్షమించండి
మూగ జీవుల విన్నపం విని కనికరించండి..!!
అను-------59

No comments:
Post a Comment