Wednesday, 12 July 2017

!!చెలిమి జ్ఞాపకం!!



నీ చెలిమిలో సేద తీరిన సమయాలు
గుంపులుగా వచ్చి నీయదలో
తలదాచుకున్న అనుభూతులు...
అన్నీ మోడువారిన  జ్ఞాపకాలై
ఇలలో మిగిలాయి ఇలా నిశ్శబ్దపు
పలకరింతలుగా...!!

 వేసవి గాలులలో-హోరైన జడివానలలో
రక్షణై కాపాడి..నీ నీడలో మాకు చోటునిచ్చి
చెంతకు పిలిచి చింతలను తీర్చిన
పచ్చని నీ ఒడి....నిలిచింది
నేడు కదలేని  శిలగా
కదలి వెళ్ళిన గతంలా...

శిశిరాలను వసంతాలను
పరిచయం చేసిన నీ కరుణని
తలచి ఎన్నో కన్నీళ్ళు పెడుతున్నా
అలసి సొలసిన వేళ
ఆదరించిన నీ చల్లని నీడకై వగచి
 నీ చేరువనే ఎదురు చూస్తున్నా
చిగురు తొడిగే క్షణాలకై
ప్రకృతిని ప్రార్థిస్తూ
మిగిలి ఉన్నా  స్నేహ  చిహ్నానిగా....!!

              అను-----44

No comments:

Post a Comment