మనసు మూగది మాటలు రానిది
అంటూ ఉంటారు వింటూ ఉంటాం
కానీ వెంటనే ఓ ప్రశ్న మొలకెత్తుతుంది
నిజంగా మనసు మూగదా....?
కాదేమో అని అనుమానం....!!
అయి ఉంటే ......
రోజూ నాతో
మాట్లాడ్డం--వాదించడం-- పోట్లాడ్డం
ఎలా చేస్తుంది అని......!!
చాలా సార్లు నేనే గెలవలేను
అర్థవంతమైన పుస్తకంలా కనిపిస్తూనే
అర్థంకాని సమాధానాలనే అడుగుతుంది...!!
అనుభవాల మూటలు ఎన్ని అందించినా
మళ్ళీ కొత్తగానే స్పందిస్తుంది
ఏమిటిదీ అని అడిగితే
జవాబు దాటేస్తూ
క్షణం ఖాళీ లేకుండా లోలోపల నాతో చర్చిస్తూనే ఉంటుంది.........!!
అప్పుడు నేనూ అనుకుంటా
మనసు మూగదేమో కానీ
మాటలు రానిది మాత్రం కాదు అని
మూగవాళ్ళ చేత కూడా
వాదం చేయించే గడసరి అని
పలికే పెదవులని సైతం ఆపేసే
నేర్పరి అని......!!
------అను-----

No comments:
Post a Comment