Wednesday, 12 July 2017

!! అందమైన సంకెళ్ళు !!



జీవన గమన రహదారిలో
తారసపడే ఎన్నో  బాంధవ్యాలలో
కొన్ని బంధాలు అల్లుకుంటూ ఉంటాయి
వద్దన్నా వదలక... వేదిస్తూ బాధిస్తూ
వెంట నడుస్తానంటూ
ముందుకు సాగనివ్వక
తిరుగు పయనానికీ దారివ్వక
ఉన్నచోటే ఊపిరాడనివ్వవు....

మనసుతో ఆటలాడుతూ
మనోభావాలకు అడ్డుతగులుతూ
జాలిపై విసుగొచ్చేలా
మంచిపై మనసు తప్పేలా
వశీకరణకు లొంగిన మదిని
అందమైన పంజరాన
అవసరాల ముసుగేసి
ఆత్మీయత ఎర చూపి
జీవితఖైదును చేస్తూ
ఉక్కు సంకెళ్ళై బిగుస్తాయి.....!!

తెంచుకోను వీలుకాని
తీగలల్లే అల్లుకోకముందే.......
తేరుకుని తప్పుకునే నేర్పు ఉంటే
ముందు చూపుతో అడుగేసే
యుక్తి నీవై సాగితే
అందమైన పూదారి నీదే
అధ్భుతమైన అనుభవ సారం నీదే....!!

       అను-----

No comments:

Post a Comment